Monday, November 10, 2008
నాకు నచ్చిన పాటల్లో ఒకటి... నేను ఎప్పుడూ ఎక్కువగా పాడుకునేది
తియ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నళ్ళయినా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో
నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలో ||తియ తీయని||
చల చల్లని మంచుకి అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చీ రాని కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దే లేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో ||తియ తీయని||
మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమే వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో ||తియ తీయని||
Subscribe to:
Posts (Atom)